మితిమీరిన అనుమానం.. అన్నంలో విషం కలిపి..

by srinivas |
మితిమీరిన అనుమానం.. అన్నంలో విషం కలిపి..
X

దిశ, వెబ్‌డెస్క్ : అతని అనుమానం మితిమీరింది. దీంతో తినే ఆహారంలో విషయం కలిపి కుటుంబసభ్యులందరినీ బలిగొన్నాడు. ఈ దారుణమైన ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నర్సన్న పేట మండలం హనుమాన్ నగర్‌లో గురువారం రాత్రి వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..రమేష్, లత భార్య భర్తలు. వీరికి ఓ కూతురు. కొన్నేళ్లు సజావుగా సాగిన సంసారంలో అనుమానం పెనుభూతంగా మారింది.

గత కొంతకాలంగా రమేష్ తన భార్య లతపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అది కాస్త మితిమీరింది. ఈ క్రమంలోనే తినే ఆహారంలో విషయం కలపడంతో భార్య లతతో పాటు కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది. నిందితుడి స్వగ్రామం ఎల్‌ఎన్ పేట మండలం కొవిలాం గ్రామంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story