భార్యను హత్య చేసిన భర్త

by Shyam |
భార్యను హత్య చేసిన భర్త
X

దిశ, మహేశ్వరం: కట్టుకున్న భర్తే కాల యముడయ్యాడు. పెండ్లి చేసుకున్న రెండేళ్లకే భార్య ఉసురు తీశాడు. రంగారెడ్డి జిల్లా పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరాంనగర్‌ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంనగర్ కాలనీకి చెందిన వరలక్ష్మీ (35), నాగరాజు (36) భార్యభర్తలు. వీరిద్దరికీ రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే మంగళవారం వరలక్ష్మీని నాగరాజు హత్య చేసి పరారయ్యాడు.ఉదయం నుంచి ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో.. అనుమానం వచ్చిన స్థానికులు తెరిచి చూడగా.. వరలక్ష్మీ రక్తపు మడుగులో కనిపించింది. దీంతో పోలీసులుకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నాగరాజు కుటంబంపై ఇది వరకే పలు దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story