పాతబస్తీలో దారుణం.. 

by Shyam |   ( Updated:2021-03-08 11:32:32.0  )
పాతబస్తీలో దారుణం.. 
X

దిశ, క్రైమ్ బ్యూరో : నగరంలోని పాతబస్తీలో భార్యపై కాల్పులకు తెగబడ్డాడు ఓ భర్త. ప్రాపర్టీ విషయంలో గత కొన్నాళ్లుగా గొడవపడుతున్న సదరు వ్యక్తి ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా భార్యపై తన సైలెన్స్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. కాలాపత్తర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బిలాల్ నగర్ నగర్కు చెందిన హబీబ్ హష్మీ (52) రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రాపర్టీ విషయంలో భార్యా, కుమారుడితో గత 6 నెలలుగా వివాదాలు అవుతున్నాయి. ఇదిలా ఉండగా, కరోనా అనంతరం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఆస్తులను విక్రయించేందుకు సంబంధిత పత్రాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. భార్య అడ్డుకుంది.

దీంతో కోపంలో వెంటనే తన వద్దనున్న పాయింట్ 2 రివాల్వర్‌తో భార్యపై కాల్పులు జరిపాడు. ఈ సమయంలో కుమారుడు ఉమర్ హష్మీ అడ్డుకోగా.. బుల్లెట్ ఇంటి గోడకు తగిలింది. ఈ సమయంలో మూడు రౌండ్ల కాల్పలు జరిపినట్టుగా తెలుస్తోంది. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సుదర్శన్ తెలిపారు. నిందితుడి నుంచి పోలీసులు రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story