భార్య పొట్ట కోసిన భర్త.. ఎందుకంటే..!

by Sumithra |
భార్య పొట్ట కోసిన భర్త.. ఎందుకంటే..!
X

దిశ, వెబ్‎డెస్క్: కడుపులో ఉన్నది ఆడో, మగో తెలుసుకోవాలంటే కొంతమంది డాక్టర్లను ఆశ్రయిస్తారు. కానీ, ఓ భర్త తన భార్య గర్భంలో ఉన్నది ఎవరో తెలుసుకునేందుకు పొట్టనే చీల్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నేక్‎పూర్ అనే గ్రామంలో పన్నాలాల్ అనే వ్యక్తికి ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన భార్య మరోసారి గర్భవతి అయింది. దీంతో ఈ సారి కూడా ఆడపిల్ల పుడితే ఎలా అని ఆందోళన చెందిన పన్నాలాల్.. ఓ పదునైన వస్తువుతో భార్య పొట్ట చీల్చాడు. భర్త విపరీత చేష్టకు ఆ గర్భవతి తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడిపోయింది. ఆమెను గమనించి స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బరేలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పన్నాలాల్‎ను అరెస్ట్ చేశారు. కొడుకు పుట్టాలని కోరుకుంటున్న పన్నాలాల్ ఈ దారుణానికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

Advertisement

Next Story