- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య కాపురానికి రావడం లేదని.. భర్త ఆత్మహత్య!
దిశ, మునుగోడు: భార్య కాపురానికి రావడం లేదని, తీవ్ర మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని చీకటిమామిడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన చెనగోని నరసింహకు మూడు నెలల కింద వివాహం జరిగింది. ఒక నెల రోజుల నుంచి, భార్య తన వద్దకు రావట్లేదని నిరాశతో వున్నట్టు బంధువులు తెలిపారు. గత వారం రోజులుగా జ్వరం వస్తుండడంతో చౌటుప్పల్‌లోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లాడు.
అక్కడి నుంచి ఆయన్ను నల్లగొండకు తరలించారు. అనంతరం డిశ్చార్జి చేసి, వారం రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. డాక్టర్ల సలహాతో గత వారం రోజుల నుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న మృతుడు నరసింహ శుక్రవారం బయటకు రాకపోవడంతో మృతిని బావ తన ఇరుగుపొరుగు వాళ్లతో కలిసి వెళ్లి చూడగా ఉరివేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. భార్య కాపురానికి రాకపోవడంతోనే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.