పెళ్ళైన కొత్తలో.. భార్యాభర్తలు ఇలా చేశారేంటి..?

by Sumithra |   ( Updated:2021-06-21 01:24:29.0  )
పెళ్ళైన కొత్తలో.. భార్యాభర్తలు ఇలా చేశారేంటి..?
X

దిశ, బాల్కొండా: నిజామాబాద్ జిల్లాలో నవ దంపతులు విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. వేల్పూరు మండలం నడుకుడలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ నెల 13న భీమయ్య, స్వాతిలు వివాహం చేసుకున్నారు. పట్టుమని పదిరోజులు సంసారం చేయకముందే చనిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్థరాత్రి విషం తాగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు వారిద్దరిని చికిత్స నిమిత్తం ఆర్మూర్‌‌ లో ఓ హస్పిటల్‌‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story