కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

by Sumithra |

దిశ, మేడ్చల్: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్​లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం నిజాంపేట శ్రీనివాసకాలనీకి చెందిన పీ సురేందర్(42) ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగి. ఆయనకు భార్య బిందు (36), ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. వీరి మధ్య మనస్పర్థలు తీవ్ర కావడంతో మంగళవారం సాయంత్రం సురేందర్, బిందులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags : husband and wife sucide, family disputs, hyderabad

Advertisement

Next Story