తప్పు చేసిన మంత్రివర్గాన్ని వదిలేసి ఉద్యోగులపై వేటా..?

by srinivas |
Yanamala Ramakrishna
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కార్‌పై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని తప్పుబట్టారు. మంత్రి వర్గం చేసిన తప్పులకు ఉద్యోగులను బాధ్యులుగా చూపిస్తూ వేటు వేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు మంత్రి వర్గం ట్రస్టీ మాత్రమేనన్న విషయం తెలుసుకోవాలన్నారు. ఆర్థిక శాఖ సమాచారాన్ని లీక్ చేశారంటూ ఉద్యోగులను సస్పెండ్ చేయడం మంచిదికాదన్నారు.

వైసీపీలోని కొందరు అవినీతి బయటకు వస్తుందనే ఉద్దేశంతో ఆ దృష్టిని మరల్చేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి, కాగ్‌కు, కేంద్ర ఆర్థిక సంస్థలకు తెలియకుండా ఖర్చులను ఎందుకు దాచారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే.. జగన్ ప్రభుత్వం కేవలం 11 లక్షల మందికే ఇస్తోందని ఆరోపించారు. చంద్రన్న బీమాను తాము 2.47 కోట్ల మందికి ఇస్తే… ఈ ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని కేవలం 67 లక్షల మందికే కుదించిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Advertisement

Next Story