మానవత్వం చాటిన సహార యూత్ సొసైటీ

by Aamani |
మానవత్వం చాటిన సహార యూత్ సొసైటీ
X

దిశ, ఆదిలాబాద్: కుల మత భేదాలు చూడకుండా అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచింది నిర్మల్ జిల్లాకు చెందిన సహారా యూత్ సొసైటీ. నిర్మల్ పట్టణంలోని గాజుల్‎పేటకు చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలు శనివారం సాయంత్రం మృతి చెందారు. కరోనా మహమ్మారి భయంతో అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ తరుణంలోనే సహార యూత్ సొసైటీ వారికి సమాచారం అందగానే మృతదేహం వద్దకు చేరుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరపడానికి ముస్లిం యువకులు సహకరించారు.

Tags: Elderly, died, Humanitarian, Funeral, Sahara Youth Society, nirmal

Advertisement

Next Story