- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరాంసాగర్‌కు జలకళ.. మరో 20 అడుగులు వస్తే..
దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1071 అడుగుల నీరు వచ్చి చేరింది. నీటి నిల్వ 90 టీఎంసీలకు గాను 31 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 5621 క్యూసెక్కులుగా ఉంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పై నుండి వరద నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.
ఈ నెల 1వ తేదీన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచిన అధికారులు..0.628 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో గోదారి పరవళ్లు తొక్కుతూ..దిగువప్రాంతంలో గల నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌లోని వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొదని, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఆర్ఎస్‌పీ అధికారులు సూచించారు.