- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరికల్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం (వీడియో)
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఎండీ వలి గత కొన్నేండ్లుగా ఇనుప సామాను వ్యాపారం చేస్తూ వస్తున్నాడు. గత మూడేండ్ల నుంచి కరోనా కారణంగా తన షెడ్డులో ఉన్న ఇనుప సామాను అమ్మకుండా కొనుగోలు చేస్తూ.. నిలువ చేస్తూ వచ్చాడు. శనివారం రాత్రి ఈదురు గాలులు వీచి కొద్దిపాటి వర్షం కురవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. కొద్దిసేపటికే తిరిగి కరెంట్ రావడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. ఈ మంటల కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. సమాచారం అందిన గంట సేపటికి ఫైర్ ఇంజన్ రావడంతో అప్పటికే షెడ్ సామాను పెద్ద మొత్తంలో కాలి బూడిద అయింది. టైర్లు, ఫైబర్ వస్తువులతోపాటు పాత గ్యాస్ సిలిండర్లు కూడా ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.