ఇన్ఫోసిస్ కంపెనీకి భారీ ఫైన్.. ఎందుకంటే?

by Anukaran |   ( Updated:2021-09-29 07:11:27.0  )
infosis
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రఖ్యాత మల్టీ నేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి మున్సిపాలిటీ అధికారులు భారీగా ఫైన్ విధించారు. హైదరాబాద్ శివారు ఘట్కేసర్ వద్ద ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీ యాజమాన్యం ఉద్యోగుల నుంచి పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్నారని సామాజిక వేత్త విజయ్ గోపాల్ హైకోర్టులో పిల్ వేశారు. సంస్థ ప్రభుత్వం నుంచి పోచారం పరిధిలోని దాదాపు 420 ఎకరాలకు పైగానే తీసుకుందని, ఇలా పార్కింగ్ సదుపాయం కూడా కల్పించలేకపోయిందని ఆయన వెల్లడించారు.

ప్రజారవాణాను ప్రోత్సహించే ముసుగులో ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల నుంచి కారు కి రూ.500, ద్విచక్రవాహనానికి రూ.250-300 వరకూ వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోచారం మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ ఇన్ఫోసిస్ సంస్థకి రూ.50,000 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కేవలం జరిమానాతో సరిపెట్టడం సరికాదని విజయ్ మండిపడ్డారు.

Advertisement

Next Story