- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను రిలీజ్ చేసిన Huawei
దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ ఫోన్ తయారీ సంస్థ Huawei కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఫోల్డబుల్‌కు అవకాశం ఉండే Huawei P50 Pocket ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఈ సంస్థ నుంచి ఇది మెుదటి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్. ఈ కొత్త ఫోన్‌ను ఎటువంటి ముడతలు కనిపించకుండా ఓపెన్ చేయడానికి అనువుగా ఉండే మల్టీ-డైమెన్షనల్ కీలు అమర్చారు. దీనిలో రెండు స్క్రీన్‌లు ఉన్నాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.9-అంగుళాల ప్రధాన OLED డిస్‌ప్లే, 1-అంగుళాల సెకండరీ OLED స్క్రీన్, HD+ (2,790×1,188 పిక్సెల్‌లు) రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తుంది.
ఇది స్నాప్‌డ్రాగన్ 888 4G SoCతో HarmonyOS పై రన్ అవుతుంది. ఈ ఫోన్ వెనుక వైపు 40MP ప్రైమరీ కెమెరా, 32MP, 13MP ట్రిపుల్ కెమెరా సెన్సార్ ఉంది. 4K రిజల్యూషన్‌లో వీడియో రికార్డ్ సపోర్టింగ్‌తో వస్తుంది. ముందు భాగంలో 10.7MP సెంట్రల్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4,000mAhతో 40W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. ఈ ఫోన్‌ను వచ్చే ఏడాది భారత్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 8GB + 256GB బేస్ స్టోరేజ్ ధర రూ.1.06 లక్షలు. ప్రీమియం 12GB + 512GB ఎడిషన్ ధర రూ.1.3 లక్షలు.