రూ.100 కోట్ల ఇల్లు కొనుగోలు చేసిన హృతిక్!

by Jakkula Samataha |
రూ.100 కోట్ల ఇల్లు కొనుగోలు చేసిన హృతిక్!
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ మోస్ట్ హాండ్సమ్ హీరో హృతిక్ రోషన్.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో జోష్‌లో ఉన్నాడు. ‘వార్, సూపర్ 30’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హృతిక్.. అదే జోష్, జోరును కంటిన్యూ చేస్తూ కొత్త ఇల్లును కొనుగోలు చేశాడు.

ఈ క్రమంలోనే జుహు- వెర్సోవా లింక్ రోడ్డులోని ఓ 16 అంతస్థుల భవనంపై డూప్లెక్స్ హౌజ్‌తో పాటు 14వ అంతస్థులో ఓ ప్లాట్ కూడా కొన్నాడని సమాచారం. డూప్లెక్స్ హౌజ్ విలువ రూ. 67.50 కోట్లు కాగా, ప్లాట్ కాస్ట్ రూ. 30 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా రూ. 97 కోట్ల 50 లక్షల విలువైన ప్రాపర్టీని కొనుగోలు చేసిన హృతిక్.. రోషన్ ఫ్యామిలీకి ఫుల్ లగ్జరీ లైఫ్ ఉండేలా ప్లాన్ చేశాడని టాక్. ప్రైవేట్ లిఫ్ట్, 10 కార్లకు సరిపడా పార్కింగ్ ప్లేస్ డిజైన్ చేశాడని తెలుస్తోంది.

కాగా, హృతిక్ తన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్‌లో కరోనా వారియర్స్ సేవల గురించి వివరించారు. తమ ప్రాణాలు రిస్క్‌లో పెట్టిన ఫ్రంట్‌లైన్ వారియర్స్ ప్రాణాలు కాపాడేందుకు మన వంతు సహాయం చేద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story