- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్‌పీసీఎల్ లాభాలు రూ. 3,018 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ యాజమాన్య సంస్థ హిందూస్థాన్ పెట్రోలియం 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 3,018 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ రూ. 27 కోట్ల లాభాలను వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ అమ్మకాలు 19 శాతం పెరిగి రూ. 84,905 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బలమైన కార్యకలాపాలు, చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో మెరుగైన లాభాలను సంస్థ నమోదు చేసినట్టు హెచ్‌పీసీఎల్ ఛైర్మన్ ఎం కె సురానా అన్నారు.
మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం రూ. 85,748 కోట్లకు పెరిగిందని, గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 71,978.62 కోట్లుగా వెల్లడించింది. కంపెనీ బోర్డు ఒక్కో షేర్‌కు రూ. 22.75 తుది డివిడెండ్‌కు ఆమోదం తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేర్ ధర గురువారం శాతం నష్టపోయి రూ. 267 వద్ద ట్రేడయింది. ఈ త్రైమాసికంలో చమురు ధరలు 23 శాతం పెరగడంతో అధిక లాభాలు నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ రూ. 10,664 కోట్ల లాభాలను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 2,637 కోట్ల లాభాలను నమోదు చేసింది.