- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చెవిటి వారికి సంజ్ఞ భాష సాంకేతిక వీడియోలు
సాంకేతిక విద్యను చెవిటి వారికి దగ్గర చేసే ఉద్దేశంతో కేరళకు చెందిన రెండు యువ జంటలు ప్రత్యేకమైన ప్రాజెక్టును తెర మీదికి తీసుకొచ్చింది. తిరువనంతపురంలోని ప్రభుత్వ టెక్నోపార్కులో ఈ ప్రాజెకట్టు రూపుదిద్దుకుంటోంది. మరో ముగ్గురితో కలిసి డిజిటల్ ఆర్ట్స్ అకాడమీ ఫర్ డెఫ్ (డీఏఏడీ) పేరుతో చెవిటి వారికి సంజ్ఞ భాషలో సాంకేతిక విద్యను అందించబోతుస్తున్నారు.
నాలుగు నెలల క్రితం ఆవిష్కృమైన ఈ డీఏఏడీ ఇప్పటికే ఫొటోషాప్, వీడియో ఎడిటింగ్ నేర్పించే 20 సంజ్ఞ భాష వీడియోలను యూట్యూబ్‌లో పెట్టింది. గతంలో బిజినెస్ అనలిస్టుగా పనిచేసిన రమ్య రాజ్ ఈ ప్రాజెక్టుకి సీఈఓ. ఒక చెవిటి విద్యార్థిగా తాను సాంకేతిక విద్య నేర్చుకునేటపుడు పడిన సమస్యలు, ఇతర చెవిటి విద్యార్థులకు రాకూడదనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు రమ్య అన్నారు. ఆమెతో పాటు సులు నౌషద్, అర్చనా క్రిష్ణన్, ప్రియా అనీష్, అనీష్‌లు ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. రమ్య భర్త సాజిత్, సులు భర్త అనీష్ కుక్కూలు ఈ ప్రాజెక్టు పనుల్లో మమేకం కానప్పటికీ వారు దీనికి డైరెక్టర్లుగా ఉన్నారు.
ఐటీ రంగంలో ఉద్యోగం పొందడంలో మిగతా వారితో కమ్యూనికేషన్ లోపం ఉండటం వల్ల చెవిటి వారు అనేక ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తోందని, కానీ సంజ్ఞ భాషలో టెక్నికల్ విద్య నేర్చుకోగలిగితే ఆ ఇబ్బందులు తప్పించుకునే అవకాశం ఏర్పడుతుందని రమ్య చెప్పారు. తాము వీడియోలను సంజ్ఞ భాషలో అందజేస్తూనే, కింద సబ్‌టైటిల్స్ కూడా ఇస్తున్నామని అన్నారు.