జోస్ బట్లర్ నాకు స్ఫూర్తి : బెన్ స్టోక్స్

by Shyam |
జోస్ బట్లర్ నాకు స్ఫూర్తి : బెన్ స్టోక్స్
X

దిశ, స్పోర్ట్స్ : ‘శరీర ధారుఢ్యానికి, క్రికెట్ ఆటకు జాస్ బట్లర్ ఇచ్చే ప్రాధాన్యతను చూసే.. నేను కూడా వాటిపై దృష్టిపెట్టానని’ ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ అంటున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ స్పిన్ సలహాదారు ఇష్ సోథితో కలిసి లైవ్ చాట్‌లో పాల్గొన్న బెన్ స్టోక్స్ పలు విషయాలు వెల్లడించాడు. ‘రెండేళ్ల కిందట తన క్రికెట్ కెరీర్ సందిగ్ధంలో ఉన్న సమయంలో తనకు తోటి క్రికెటర్ జోస్ బట్లర్ స్ఫూర్తిగా నిలిచాడు. క్రికెట్ మాత్రమే కాకుండా ఆటగాళ్లు ఫిట్‌నెస్, ఆరోగ్యం కాపాడుకునేందుకు ఏం చేయాలో బట్లర్ అన్నీ చేశాడు. సాధారణంగా అందరూ నెట్ ప్రాక్టీస్, వ్యాయామం కోసం గంట సేపు కష్టపడితే బట్లర్ మరో 45 నిమిషాలు అదనంగా వెచ్చించేవాడు. అతడి కష్టాన్ని చూసే తాను కూడా ఆట, ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ద పెట్టానని’ బెన్ స్టోక్స్ చెప్పాడు.

కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ఆటగాళ్లతో లైవ్ చాట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న స్టోక్స్ ఈ విషయాలను వెల్లడించాడు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో స్టోక్స్, బట్లర్ కీలక ఆటగాళ్లుగా ఉన్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ గెలుపునకు వీరిద్దరి బ్యాటింగ్, ఫీల్డింగే ప్రధాన పాత్ర పోషించింది. కాగా, వీరిద్దరూ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నారు.

Tags : IPL, Cricket, Ben Stokes, Jos Buttler, ECB, Rajastan Royals, Ish Sodhi

Advertisement

Next Story