ట్రంప్‌ను హెచ్చరించిన హ్యూస్టన్ పోలీస్ చీఫ్

by vinod kumar |
ట్రంప్‌ను హెచ్చరించిన హ్యూస్టన్ పోలీస్ చీఫ్
X

వాషింగ్టన్: ఆఫ్రికా-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌ను ఒక పోలీసు అత్యంత కర్కషంగా చంపేసిన ఉదంతం తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వేలాది మంది అమెరికన్లు వీధుల్లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్, మిన్నెపోలీస్‌లో మొదలైన ఈ ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తమయ్యాయి. దీంతో ఆందోళనకారులను కించపరుస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ”మీ లూటింగ్ మొదలైతే.. మా షూటింగ్ మొదలవుతుంది” అంటూ ట్వీట్ చేశారు. ఇది ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలపై ఆజ్యం పోసినట్లైంది. ఇప్పటికే జరిగిన ఘటనపై క్షమాపణలు కోరుతూ కొంత మంది పోలీసులు, శ్వేతజాతీయులు మోకాళ్లపై నిలబడి క్షమాపణలు కోరారు. తాజాగా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర పోలీస్ బాస్ అసేవిడో మాత్రం ఏకంగా అధ్యక్షుడికే వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని.. ఆయన నోరు మూసుకుంటే మంచిదని కాస్త ఘాటుగానే హెచ్చరించాడు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆందోళనకారుల ఆగ్రహం మరింత పెరుగుతుందని.. కాస్త సమన్వయం కోల్పోకుండా సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం ఆలోచిస్తే మంచిదని ఆయన హితవు పలికారు.

Advertisement

Next Story