కాంగ్రెస్​ నేతల హౌస్​ అరెస్ట్​.. తప్పించుకొని మరీ..

by Shyam |   ( Updated:2021-07-19 01:11:48.0  )
కాంగ్రెస్​ నేతల హౌస్​ అరెస్ట్​.. తప్పించుకొని మరీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్​ నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో పెట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మండలి మాజీ నేత షబ్బీర్​ అలీ, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి, ఎన్​ఎస్​యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్​ సహా పలువురు నేతలను ఉదయం నుంచే హౌస్​ అరెస్ట్​ చేశారు. కాగా, కోకాపేట భూముల దగ్గర ఆందోళనకు దిగేందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్​ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. అయినప్పటికీ పలువురు కాంగ్రెస్​ నేతలు పోలీసులను తప్పించుకుని కోకాపేట భూముల దగ్గర కాంగ్రెస్​ జెండాలను ఎగురవేశారు.

Advertisement

Next Story