- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు
మేష రాశి : నేడు ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుటుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. చేపట్టిన పనులన్నీ నెరవేరుతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు బాగుటుంది.
వృషభ రాశి : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. దశమంలో శనీశ్వరుడి కారణంగా ఉద్యోగ జీవితంలో మధ్య మధ్య ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. అధికారుల నుంచి వేధింపులుంటాయి. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి : అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అందుకు తగ్గుట్టుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఎవరి తోనైనా ఆచితూచి వ్యవహరించడం అన్నివిధాలా మంచిది.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు. ఇది ఈరోజు మీ ఆర్థికసమస్యలను తీర్చుతంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆఫీసుల్లో పని చేసేవారు, సహా ఉద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎన్నో గొప్ప అవకాశాలు మీ చేతికి అంది వచ్చినా, మీరు వాటిని అందుకోలేరు. నేడు మీరు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహ రాశి :ఈ రాశి వారు ఉమ్మడి వ్యాపారలలోనూ, ఊహల ఆధారితమైన పథకాలలో పెట్టుబడులు అస్సలే పెట్టకూడదు.ఈరోజు మీరు మీ స్నేహితులు, బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పని చేసే చోట మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. నేడు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా రోజంతా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కన్యా రాశి : ఈరోజు మీరు మీ పిల్లలతో ఎక్కుసేపు గడపడానికి ఆసక్తి కనబరుస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. చాలా కష్టంగా పని చేస్తారు. కానీ శ్రమకు తగిన ఫలితం ఉంటదు. భారీ ఆర్థిక వ్యవహారాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి, అలాగే కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది.మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. నేడు మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.
తుల రాశి : ఈరోజు మీరు అనుకున్న పని చేయడానికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పెళ్లిఅయినవారు వారిధనాన్ని వారియొక్క పిల్లల చదువుకోసము ఖర్చుపెట్టవలసి ఉంటుంది. ఒక ఉల్లాసాన్నిచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు, వారుండే చోటికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలను కలిగిస్తాయి. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు.
వృశ్చిక రాశి : ఈ రోజు ఈ రాశి వారు తమ లక్ష్యాల వైపు మొగ్గు చూపుతారు. విజయం వైపు అడుగులు వేస్తారు. కానీ విజయం రావావలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు మారాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ధనస్సు రాశి : నేడు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా మీకు కొత్తగా ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీని వలన మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థికంగా బాగుంటుంది.
మకర రాశి : కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. దశమంలో శనీశ్వరుడి కారణంగా ఉద్యోగ జీవితంలో మధ్య మధ్య ఒడిదుడుకులు ఎదురు కావచ్చు
కుంభ రాశి : నేడు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. విద్యార్థులు శుభవార్త వింటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
మీన రాశి : ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది పెడతాయి. కొద్దిగా ఆలస్యంగానైనా సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతుంటాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.