- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Today's Horoscope : ఈ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త..ప్రమాదాల భారిన పడే అవకాశం ఉంది!
మేష రాశి : నేడు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.చిన్న చిన్న పనులకోసం ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం వలన చిక్కుల్లో పడుతారు. డబ్బు విషయంలో జాగ్రత్తలు అవసరం.
వృషభ రాశి : ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలల్లో పాల్గొంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవడం వలన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మిథున రాశి : నేడు ఈ రాశి వారు అధికంగా ఖర్చు చేస్తారు. ఇది మీ కుటుంబంలో కలహాలకు కారణం అవుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సానుకూల వాతవారణం ఉండటంతో పాటు, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.
కర్కాటక రాశి : ఈ రాశి వారు అప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. నేడు ఈ రాశి వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. రుణసదుపాయం లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు నేడు చాలా సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి : విద్యార్థులు నేడు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతి విషయంలో ఆచీ తూచీ అడుగు వేయడం చాలా మంచిది. వివాహాది శుభకార్యాలకు నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నేడు ఈ రాశిలోని వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే కానుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది.
కన్యా రాశి : నేడు ఈ రాశి వారు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు.ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దీర్ఘకాలిక వ్యాధుల వలన సమస్యలు ఎదుర్కొంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కలిసి వస్తుంది. నేడు ఈ రాశి వారికి ఉన్నత పదువుల్లో అవకాశం లభిస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు.
తుల రాశి : ఈ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశిలోని వారు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. సీనియర్ల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో వీరి సమస్యలన్నీ తీరి నేడు చాలా సంతోషంగా గడుపుతారు.
వృశ్చిక రాశి : నేడు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. కానీ ఆఫీసులో మీ ప్రవర్తన కొంత మందికి నచ్చకపోవడంతో సమస్యల్లో చిక్కుకుంటారు. మీకు తెలియకుండా మీరే ఇబ్బందులను సృష్టించుకొని, సీనియర్ల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ భాగస్వామి ప్రవర్తన మీకు అంతగా నచ్చదు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ధనస్సు రాశి : వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువులు, కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు అవకా శాలు అందివస్తాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులు, ప్రయత్నాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి.
మకర రాశి : శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ జీవితం సాను కూలంగా గడిచిపోతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి.
కుంభ రాశి : వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను మరింత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం.
మీన రాశి : ఈరోజు ఈ రాశి వారు ఏదోఒక పని పై లీనం అవుతుంటారు. ప్రమాదాల భారిన పడే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఈరోజు సంతోషంతో నిండిన మంచి రోజు కానుంది.