Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

by samatah |   ( Updated:2023-08-09 18:45:30.0  )
Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
X

మేష రాశి : ఈ రాశి వారికి నేడు ఆదాయం బాగుంటుంది. కానీ అనసవసర ఖర్చుల వలన రోజు చివర్లో ధనాన్ని పొదుపు చేయలేరు. వ్యాపారస్తులు ఇతరులతో కలిసి పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించడం అవసరం. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

వృషభ రాశి : ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్ధికలాభాన్ని చేకూరుస్తుంది. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి, మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. .సీనియర్లనుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు.

మిథున రాశి : అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. చంద్రునియొక్క స్థానప్రభావమువలన మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చుచేస్తారు.మీరు మీ ఆర్థికస్థిని మెరుగుపరుచుకోవాలంటే మీ జీవితభాగస్వామితో,తల్లితండ్రులతో మాట్లాడండి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది.మీ సహ ఉద్యోగులు, సహకరించే అసోసియేట్ లు మీకు సహాయం అందిస్తారు. ఈరోజు మీరు ఖాళి సమయంలో ఇప్పటివరకు పూర్తిచేయని పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు.

కర్కాటక రాశి : వృత్తి, ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. మధ్య మధ్య స్నేహితులతో సమస్యలు తలెత్తుతుంటాయి. కొత్తవారు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమా చారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

సింహ రాశి : ఆరోగ్యం బాగుంటుంది. స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. కొత్త వారితో పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారా లతో అత్యవసర వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు.

కన్యా రాశి :మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది.ధూమపానం,మద్యపానము మీద అనవసరముగా ఖర్చుపెట్టటము మానుకోండి.లేనిచో ఇదిమీకు అనారోగ్యముమాత్రమేకాదు,మీ ఆర్ధికారిస్థితిని కూడా దెబ్బతీస్తుంది. పనిలో మీరు గొప్ప లబ్దిని పొదుతారు. ఈరోజు సాయంత్ర సమయాన్ని మీ సహుద్యోగితో గడుపుతారు.చివర్లో మీరు గడిపిన సమయము అనవసరం,వృధాఅయినట్టు భావిస్తారు. నేడు సానుకూలంగా ఉంటుంది.

తుల రాశి :ఈ రాశి వారు నేడు సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. అవే మిమ్ముల్ని ఆర్థికసమస్యల నుంచి కాపాడుతాయి. ఉద్యోగులకు తమ ఆఫీసులో ఒత్తిడి వాతావరణం ఏర్పడుతుంది. వర్క్ ఎక్కువగా ఉండటం వలన కాస్త ఇబ్బంది పడుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడపలేరు. ఇది మానసిక అశాంతిని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చిక రాశి : నేడు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతాయి. వ్యాపారంలలో లాభాలు ఉన్నప్పటికీ తగినంత ధనాన్ని పొదుపు చేయలేకపోతారు. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖులతోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈ రోజు, మీరు ఇష్టపడే వ్యక్తికి మీభావాలను చెప్పలేకపోతారు. ఆఫీసులో మీకు ఈ రోజు ఓ అద్భుతమైన రోజులా కన్పిస్తోంది.

ధనస్సు రాశి : ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. దూరపు బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయాలి.


మకర రాశి : నేడు ఈరాశి వారికి కోర్టు సంబంధ వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. ఈ రాశి వారు నేడు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెల కొంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అనుకోని లాభాలు రావడం కుటుంబాన్ని అంతటినీ సంతోషంతో ముచ్చెత్తుతుంది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

కుంభ రాశి: ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఎవరైతే చాలా రోజులుగా రుణప్రయత్నం చేస్తున్నారో వారికి నేడు కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. నిరుద్యోగులకు నేడు అనుకూలమైన రోజు. ఉద్యోగులకు కాస్త ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా అవుతాయి. దీంతో నేడు మీరు ధనాన్ని పొదుపు చేయలేరు. అందువలన ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.


మీన రాశి : ఈ రాశి మహిళలు నేడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరగడం వలన కాస్త అసహనానికి లోను అవుతారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు విషయాలు మీకు అనుకూలంగా ఉండనున్నాయి. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

Advertisement

Next Story