Today Horoscope : నేటి రాశిఫలాలు

by Jakkula Samataha |   ( Updated:2024-05-17 18:45:54.0  )
Today Horoscope : నేటి రాశిఫలాలు
X

మేష రాశి : ఈరోజు ఆరోగ్యం విషయంలో బాగుంటుంది. కొత్త వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి.ఈరోజు,కొంతమంది వ్యాపారవేత్తలు వారిప్రాణస్నేహితుడి సహాయమువలన ఆర్ధికప్రయోజనాలు పొందుతారు.ఈధనము వలన మీరు అనేక సమస్యలనుండి బయటపడవచ్చును. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది మంచి సమయం.


వృషభ రాశి : నేడు ముఖ్యమైన పనులన్నీ త్వరతర్వగా తీరిపోతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరుఆర్ధికంగా నష్టపోతారు. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ లగురించి చెప్పడానికిది మంచి సమయం.

మిథున రాశి : మీ సరదా స్వభావం మిమ్ముల్నే కాకుండా మీ చుట్టూ ఉన్న వారిని కూడా చాలా సంతోషంగా ఉంచుతుంది. ఆఫీసులో ఈరోజు మీకు చాలా అద్భుతంగా మారనుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలవడం, సమయానికి డబ్బులు చేతికి అందడం వలన ఆర్థి కసమస్యలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా గడుపుతారు.


కర్కాటక రాశి : వ్యాపారులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారు నేడు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

సింహ రాశి : ప్రేమ స్నేహం బంధాలు బాగున్నాయి. ప్రేమవ్యవహారాలలో బలవంతపెట్టడం మానండి. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. విహార యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం మంచిది.

కన్యారాశి : అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి.స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఈ రాశి మహిళలు ఈరోజు అధికంగా ఖర్చు చేయడం జరుగుతుంది.

తుల రాశి : ఈ రాశి వారికి కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ జీవితంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెంచుకునేందుకు ఆలోచన చేస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

వృశ్చిక రాశి : బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు చాలా కలిసి వస్తుంది. డబ్బువిలువ మీకు తెలియదు కాని,ఈరోజు మీరు డబ్బుయొక్క విలువను తెలుసుకుంటారు.మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు, త్వరితమైన చర్యను అవసరమౌతాయి. ఓటమి ఈరోజు మీవెనుకనే ఉంటుంది, కనుక వాటినుండి పాఠాలు నేర్చుకొవాలి. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్ట్ లగురించి పనిచెయ్యడానికి కూడా, ఇది మంచి సమయం.


ధనస్సు రాశి : చిరకాలంగా మార్కెట్ ఫీల్డ్ లో చేరాలన్న కల నెరవేర గలదు. అది మీకు ఎంతో ఆనందాన్నిచ్చి ఆ ఉద్యోగంకోసం మీరుపడిన కష్టాలన్నిటినీ మరిపిస్తుంది. ఈరోజు మీకుటుంబసభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు.కానీ మీరు మీసొంత ప్రపంచానికి సమయము కేటాయిస్తారు.ఖాళీసమయములో మీకునచ్చినట్టుగా ఉంటారు. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు.

మకర రాశి : ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. వివాహ ప్రయత్నాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం చేస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. చిన్న వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది.


కుంభ రాశి : మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లకి వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగుగా తయారు చేస్తాయి. మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. అనుకోని వార్త పిల్లలనుండి వచ్చి సంతోషపరుస్తుంది. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. మీరు ఏ క్రొత్త ప్రాజెక్ట్ అంగీకరించే టప్పుడైనా రెండుసార్లు ఆలోచించండి.


మీన రాశి :ఇతరుల విజయాలను పొగడడం ద్వారా, ఆనందిస్తారు. మీరు సమయానికి,ధనానికి విలువఇవ్వవలసి ఉంటుంది,లేనిచో రానున్న రోజులలో మీరుసమస్యలు,పరీక్షలు ఎదురుకొనకతప్పదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆచితూచి మాట్లాడండి. కొన్ని ముఖ్యమైన పనులు బాగా ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది కానీ, మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. ఆదాయపరంగా శుభవార్త వింటారు.

Advertisement

Next Story