పంచగ్రహ కూటమి.. ఆ రాశుల వారికి నష్టాలు

by Prasanna |
పంచగ్రహ కూటమి.. ఆ రాశుల వారికి నష్టాలు
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. పంచగ్రహ కూటమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పంచగ్రహ కుటమి అనేది ఒకే సమయంలో ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఇది అరుదైన సంఘటనగా జ్యోతిష్యులు చెబుతుంటారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుందని అంటున్నారు. జూన్ 5, 2024 న, చాలా ముఖ్యమైన జ్యోతిషశాస్త్ర బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడుమిథున రాశిలో కలవబోతున్నాయి. దీని వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఈ కారణంగా కొన్ని రాశుల వారు నష్టాలు తప్పవని అంటున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మకర రాశి

ఈ పంచగ్రహాల కూటమి వల్ల ఈ రాశి వారికి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కాబట్టి, వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యంలో కూడా వివిధ మార్పులు సంభవిస్తాయి. అందుకే తినే వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అనేక ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి.

మేష రాశి

ఈ రాశి వారికి కూడా ఈ పంచగ్రహ కుటం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అంతే కాకుండా చిన్న సమస్య కూడా ఉంది. అందువల్ల, జ్యోతిష్యులు ఈ వ్యక్తులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story