ఒకే రాశిలో 4 గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

by Prasanna |
ఒకే రాశిలో 4 గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
X

దిశ, ఫీచర్స్: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి గుండా వెళుతుంది. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికలు, సంచారాలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో, ఒక రాశిలో అనేక గ్రహాల కలయిక వల్ల కొన్ని యోగాలు కూడా ఏర్పడతాయి. సూర్యుడు, బృహస్పతి, బుధుడు, శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాయి. దీని వలన చాలా శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వలన ఈ రాశుల వారు ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభ రాశి

ఒకే రాశిలో సూర్యుడు, గురు, బుధ, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే చతుర్గ్రాహి యోగం కారణంగా వృషభ రాశివారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి.

మేష రాశి

చతుర్గ్రాహి యోగం ఏర్పడడం వల్ల మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు అంటున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవావారికి లాభాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే ఛాన్స్‌ కూడా ఉంది. ఈ సమయంలో ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story