గాంధీ ఆస్పత్రిలో అత్యాచార కేసు.. మంత్రుల కీలక ఆదేశాలు

by Anukaran |
గాంధీ ఆస్పత్రిలో అత్యాచార కేసు.. మంత్రుల కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ ఆసుపత్రి ఘటనలో నిందితులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం హోంమంత్రి కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, నగర సీపీ అంజనీకుమార్, అడిషనల్ సీపీ శిఖా గోయల్, డీసీపీ కల్మేశ్వర్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావులతో మహమూద్ అలీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు సీఎం కేసీఆర్ మార్గదర్శకాలతో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేసి, వేగంగా పరిష్కరించాలని, చట్ట పరంగా చర్యలు చేపట్టాలని మంత్రులు పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని త్వరలో పట్టుకుంటామని సీపీ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed