'హిట్' రిలీజ్ డేట్ ఫిక్స్

by Shyam |
హిట్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

నేచురల్ స్టార్ నాని… నిర్మాతగా మారి ‘అ!’ అనే సినిమాతో సక్సెస్ అయ్యాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా అవార్డులు మాత్రం అధికంగా అందుకుంది. దీంతో నాని నిర్మాతగా మరో సినిమా చేశాడు. వాల్ పోస్టర్ బ్యానర్‌లో ఫలక్‌నామా దాస్ ఫేం విశ్వక్ సేన్ కథానాయికుడిగా ‘హిట్’ చిత్రాన్ని నిర్మించాడు.

సినిమాలో విశ్వక్ సేన్ విక్రమ్ రుద్రరాజ్ అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. మిస్సింగ్ కేసు చుట్టూ సాగే ఈ కథ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ప్రీతి అనే అమ్మాయి అదృశ్యం కాగా ఆమె ఆచూకీ ఎలా తెలుసుకున్నాడు? అసలు ప్రీతి ఎవరు? ఏం జరిగింది? అనేదే కథ? ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమాను ఫిబ్రవరి 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.

సినిమాలో ట్విస్ట్‌లతోపాటు నాని గెస్ట్ అప్పియరెన్స్ ఉంటుందని టాక్. కథను మలుపులు తిప్పే పాత్రలు చాలా ఉంటాయని, విశ్వక్ సేన్ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తాడని సమాచారం. అయితే ‘అ!’ సినిమాతో నిర్మాతగా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ నాని ఇప్పుడైనా సక్సెస్ అవుతాడో లేదోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story