- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తొలి త్రైమాసికం కంటే మెరుగ్గా ఉంటుంది’
దిశ, వెబ్‌డెస్క్: హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండో త్రైమాసికంలో రికవరీ సాధిస్తుందని ఆదిత్య బిర్లా ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. హిందాల్కో లిమిటెడ్ అల్యూమినియం ప్లాంట్లు అన్ని పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అన్ని లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల పనితీరు తిరిగి ట్రాక్‌లోకి వస్తున్నాయని, అల్యూమినియం ఉత్పత్తి కొవిడ్-19కి ముందుస్థాయికి చేరుకోవచ్చని కుమార్ మంగళం బిర్లా చెప్పారు.
వర్చువల్‌గా జరిగిన హిందాల్కో వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. ‘హిందాల్కో యాజమాన్యంలోని అనుబంధ సంస్థ నోవెలిస్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఉత్తర అమెరికా, చైనాలోని అన్ని ఆటోమోటివ్ కస్టమర్లు దాదాపు కోవిడ్‌కి ముందు స్థాయికి చేరుకుంటున్నారు. దేశీయంగా ఎగుమతి డిమాండ్ స్థిరంగా ఉంది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను భర్తీ చేస్తూనే ఉన్నామని’ బిర్లా వాటాదారులను ఉద్దేశించి చెప్పారు. జూన్ త్రైమాసికంలో జీడీపీలో తిరోగమనం ఉన్నప్పటికీ, కార్యచరణ స్థాయిలు క్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం, తొలి త్రైమాసికం కంటే మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాం. రెండో భాగంలో తిరిగి కొవిడ్-19 ముందు స్థాయికి తిరిగి వస్తామని బిర్లా పేర్కొన్నారు. అలాగే, 2020-21లో ఫిక్స్‌డ్ ఖర్చులను 15 శాతం తగ్గించనున్నట్టు బిర్లా తెలిపారు.