తల్లి కాబోతున్న సమంత.. ఈ ఫోటోనే సాక్ష్యమంటున్న నెటిజన్స్

by Shyam |   ( Updated:2021-06-07 06:55:47.0  )
తల్లి కాబోతున్న సమంత.. ఈ ఫోటోనే సాక్ష్యమంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై, అక్కినేని వారసుడు నాగ చైతన్యని మాయలో పడేసి అక్కినేని కోడలుగా సెటిల్ అయిపోయింది సమంత. ఇక ఈ జంట టాలీవుడ్ లోనే మోస్ట్ డిజైరబుల్ జంటల్లో ఒకటి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సామ్, చైతన్య వారి వారి కెరీర్లో బిజీ గా ఉన్న విషయం తెల్సిందే. ఇక పెళ్లైన ఏడాది నుండే సామ్ కి సోషల్ మీడియాలో ప్రగ్నెన్సీ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. తల్లి ఎప్పుడు అవుతారు అంటూ నెటిజన్లు సామ్ ని ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నారు. ఇటీవల సామ్ ఈ ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పడంతో ఈ విషయం కొంత సద్దుమణిగిందని చెప్పాలి. ఇక తాజాగా సామ్ ‘సాకీ’ అనే పేరుతో దుస్తుల వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సామ్ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

వైట్ కలర్ డ్రెస్ లో అరుగు మీద కూర్చొని నవ్వులు చిందిస్తున్న సామ్ కొంచెం ప్రత్యేకంగా కనిపించింది. ఇక ఈ ఫొటోలో సామ్ కన్నా మామిడి కాయను ఎక్కువగా ఫోకస్ చేయడం తో ఈ ఫోటో పై అభిమానులు పలు అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. సామ్.. తల్లి కాబోతోందా..? అంటూ అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక ఈ ఫొటోలో సామ్ కొంచెం బొద్దుగా కనిపించడం, మామిడికాయను ఫోకస్ చేయడం ఈ వార్తకు బలాన్ని చేకూర్చాయి. దీంతో ఆమె అభిమానులు సామ్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నావా..? అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై సామ్ ఎటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఇక ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో సామ్ మంచి విజయాన్ని సొంతం చేసుకొంది

Advertisement

Next Story

Most Viewed