- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్?
దిశ, వెబ్‌డెస్క్ : ఉమన్ సెంట్రిక్ సినిమాలకు ప్రయారిటీ ఇస్తూనే, మరోవైపు కమర్షియల్ మూవీస్‌కు సై అంటున్న నయనతార కెరీర్.. టాప్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన ఈ లేడీ సూపర్ స్టార్.. కొన్నాళ్లుగా తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి గురించి మీడియాలో తరచూ వార్తలొస్తున్నా.. వాటిపై ఈ ప్రేమ పక్షులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా నయనతార పెళ్లి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నయన్-విఘ్నేశ్ శివన్ పెళ్లి పీటలెక్కనున్నారని టాక్ కోలీవుడ్‌లో స్ప్రెడ్ అవుతోంది.
హిందూ, క్రైస్తవ సంప్రదాయ పద్ధతుల్లో వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారని, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనుందని తెలుస్తుండగా.. అఫిషియల్ ప్రకటన మాత్రం వెలువడలేదు. 2015లో ‘నానుమ్ రౌడీదాన్’ షూటింగ్ టైమ్‌లోనే నయన్-విఘ్నేశ్ ప్రేమలో పడ్డారు. కాగా ఐదేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ స్టార్ కపుల్.. సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక అప్‌డేట్‌ను షేర్ చేస్తుంటారు.