ఏఎస్ రావునగర్‌లో సందడి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్ ఫేం నభా నటేష్’

by Shyam |   ( Updated:2021-10-09 09:02:48.0  )
ఏఎస్ రావునగర్‌లో సందడి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్ ఫేం నభా నటేష్’
X

దిశ, ఉప్పల్ : హైదరాబాద్ కాప్రా సర్కిల్ ఏఎస్‌రావు నగర్‌లో ప్రముఖ సినీ నటి, ఇస్మార్ట్ శంకర్ ఫేం నభా నటేష్ సందడి చేశారు. ఏఎస్‌రావు నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మంగళగౌరి వస్త్ర షోరూంను శనివారం ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. అందాల తారను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మగువల మనసు దోచే కంచి పట్టు చీరల ప్రపంచం ‘కాంచీపురం మంగళ గౌరీ సిల్క్స్ ’ షోరూంను లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

సంప్రదాయ పండుగలు, ఇతర వేడుకలకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు కాంచీపురం మంగళ గౌరీ సిల్క్స్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కంచి, ధర్మవరం, ఉప్పాడ, పోచంపల్లి, గద్వాల్, బనారస్, జైపూర్, కేరళ ఇలాంటి ఎన్నో రకాల చీరలతో పాటు, అన్ని వెరైటీల పట్టు, ఫ్యాన్సీ చీరలు, గాగ్రాలు, లేహంగాలు, లాంగ్ ఫ్రాక్స్, హాఫ్ శారీస్, పట్టు పావడాలు కూడా షోరూంలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా తక్కువ ధరలకే వాటిని సొంతం చేసుకోవచ్చని నిర్వహకులు తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ కృష్ణమూర్తి, డైరెక్టర్ వంశీ పాల్గొన్నారు.

Advertisement

Next Story