- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిక్స్ ప్యాక్ తో వస్తున్న యంగ్ హీరో నిఖిల్
దిశ వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇటీవలే ‘అర్జున్ సురవరం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తన రాబోయే చిత్రం ‘కార్తికేయ 2’ కోసం కసరత్తులు చేస్తున్నాడు ఈ యువ హీరో. ఈ సారి వెండితెరపై సిక్స్ ప్యాక్ లో సందడి చేయనున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను నిఖిల్ ట్విటర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.
హీరో నిఖిల్, దర్శకుడు చందు మెుండేటి కాంబోలో 2014 తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ’, ఈ సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా సీక్వెల్ గా కార్తికేయ-2 రానుంది. ఇప్పటికే వచ్చిన ‘కార్తికేయ-2’కాన్సెప్ట్ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా, కాళభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సీక్వెల్ సినిమా కోసమే నిఖిల్ తొలిసారి సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నారు. తాజాగా నిఖిల్ తన షర్ట్ లెస్ ఫోటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
నాలుగు వారాలే:
ఇప్పటికే నిఖిల్ సిక్స్ ప్యాక్ షేప్ కోసం కావాల్సిన తీవ్ర కసరత్తులు ప్రారంభించారు. దీనికి సంబంధించిన సెల్పీ ఫోటో తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు నిఖిల్. మరో నాలుగు వారాల్లో ఫుల్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నట్లుగా నిఖిల్ ట్విట్ చేశారు. ప్రస్తుతానికి ఇంట్లోని డంబెల్స్ తోనే నిఖిల్ వర్క్ వుట్లు చేస్తున్నాడు. అంతేకాదు చాలామంది జిమ్ కు వెళ్తేనే వ్యాయామం చేసినట్టుగా భావిస్తారని, ఇంట్లోనే వస్తువులతోనే సిక్స్ ప్యాక్ ట్రై చేయొచ్చని, యూట్యూబ్ లో ఎన్నో జిమ్ వీడియోలు ఉన్నాయని సూచించాడు నిఖిల్.
Tags: hero nikhil, karthikeya 2, chandoo mondeti, people’s media factory, tollywood, six pack,