అభిమానులను సర్ ప్రైజ్ చేసిన నాని.. దసరా రోజు క్లారిటీ ఇస్తానంటూ పోస్ట్

by Shyam |   ( Updated:2021-10-14 03:58:17.0  )
అభిమానులను సర్ ప్రైజ్ చేసిన నాని.. దసరా రోజు క్లారిటీ ఇస్తానంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని.. లాక్‌డౌన్ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం దసరా పండుగ సందర్భంగా తన 29వ కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేయనున్నాడు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్.. అక్టోబర్ 15 దసరా పండుగనాడు మధ్యాహ్నం గం 1.53 నిమిషాలకు అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ఇక ఇటీవలే ‘టక్ జగదీష్’ సినిమాతో ఆకట్టుకున్న నాని.. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ అనే హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే.. సుందరానికి’ అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూనే మరో కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. ఈ మూవీని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్ చెరుకూరి నిర్మించనుండగా, కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story