మహేశ్ కటౌట్‌కు పాలాభిషేకం చేసిన నాగచైతన్య

by Shyam |   ( Updated:2021-03-09 02:21:20.0  )
naga chaitanya mahesh babu
X

దిశ, సినిమా : ‘జోష్’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య.. లవర్ బాయ్‌ తరహా సాఫ్ట్ రోల్స్‌ ప్లే చేస్తూ సక్సెస్ అవుతున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ‘లవ్‌స్టోరి’, ‘మనం’ ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో చైతు సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభిమానిగా కనిపించనున్నట్లు తెలుస్తుండగా ఇటీవల విడుదలైన ‘లవ్‌స్టోరి’ టీజర్‌తో పాటు ‘సారంగదరియా’ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ‘థాంక్యూ’ విషయానికొస్తే.. సినిమాలో భాగంగా తన అభిమాన హీరో మహేశ్‌బాబు కటౌట్‌కు పూలమాల వేసి అభిషేకం చేస్తున్న చైతు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తున్న చైతు.. థియేటర్‌లో ‘ఒక్కడు’ మూవీ రిలీజ్ సందర్భంగా మహేశ్ అభిమానిగా చైతు సందడి చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి మంచి జ్ఞాపకాలను అందించిన విక్రమ్ కె.కుమార్ ‘థాంక్యూ’ సినిమా ద్వారా చైతన్యను కొత్తగా ఆవిష్కరించబోతున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ, అవికా గోర్ హీరోయిన్లు కాగా, బీవీఎస్ రవి కథను అందించారు.

Advertisement

Next Story