‘బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలి’

by Anukaran |   ( Updated:2020-09-26 01:40:56.0  )
‘బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న ఇవ్వాలని ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ డిమాండ్ చేశారు. ఇందుకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీలన్నీ కలిసి పోరాడాలని తెలిపారు. 45 వేల పాటలు పాడటం, ఇక ఎవరికీ రెండు జన్మలెత్తినా సాధ్యం కాదని అన్నారు. ఆయన లేని లోటు దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలకు తీరని లోటు అన్నారు. కాగా శనివారం చెన్నైలోని బాలు ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

Advertisement

Next Story