తగ్గిన బొగ్గు దిగుమతులు!

by Harish |
తగ్గిన బొగ్గు దిగుమతులు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత పోర్ట్స్ అసోసియేషన్ (Indian Ports Association)ప్రకారం.. భారత్‌లోని 12 ప్రధాన ఓడరేవుల్లో (Ports) థర్మల్ (Thermal), కోకింగ్ బోగ్గు దిగుమతులు (Coking coal imports) ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో 31 శాతం తగ్గి 36.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. కేంద్ర నియంత్రణలో ఉన్న ఈ 12 ప్రధాన ఒడరేవుల్లో బొగ్గు దిగుమతులు వరుసగా నాలుగవ నెలలోనూ తగ్గాయి.

థర్మల్ బొగ్గు దిగుమతులు (Thermal coal imports) 30 శాతం తగ్గి 23.19 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అదే సమయంలో కోకింగ్ బొగ్గు రవాణా 32.26 శాతం తగ్గి 13.51 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం (Financial year) ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో ఇవే 12 ప్రధాన ఓడరేవులు 33.11 మెట్రిక్ టన్నుల థర్మల్ బొగ్గు, 13.51 కోకింగ్ బొగ్గును నిర్వహించాయని గణాంకాలు చెబుతున్నాయి.

విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం పొడిగ్ ఇంధనంపై ఆధారపడి ఉన్నందున థర్మల్ బొగ్గు భారత ఇంధన రంగానికి ప్రధానమైంది. అలాగే, కోకింగ్ బొగ్గును ప్రధానంగా ఉక్కు తయారీకి ఉపయోగిస్తారు. చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు. ఈ ఓడరేవులు గత ఆర్థిక సంవత్సరం మొత్తం 705 మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించాయి. పోర్టుల సంస్థ ప్రకారం..ఈ ఓడరేవులు 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై మధ్యకాలంలో 236.01 మెట్రిక్ టన్నులను నిర్వహించాయి.

Advertisement

Next Story

Most Viewed