భారీ వర్షాలకు రహదారిపై గండి

by Shyam |
భారీ వర్షాలకు రహదారిపై గండి
X

దిశ, వెబ్‎డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సూర్యపేట-జనగామ రహదారిపై భారీ గండి పడింది. దీంతో లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల దగ్గర ఓ లారీ ఇరుక్కుపోయింది. ఫలితంగా సూర్యాపేట-జనగామ వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు రూటు మళ్లించడంతో కొత్తదారి తెలియక సమీపంలోని ఆర్టీసీ కాలనీ దగ్గర ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed