హైదరాబాద్‌లో భారీ వర్షం

by Shyam |
హైదరాబాద్‌లో భారీ వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని అన్నిప్రాంతాల్లో వర్షం దంచికొట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, కొంపల్లి, లింగంపల్లి, మియాపూర్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో వాన కురవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. వాహనదారులు ఎక్కడికక్కడ షాపుల ముందు నిల్చున్నారు. దాదాపు 2గంటల పాటు వర్షం బీభత్సం సృష్టించడంతో రోడ్లపై నీరు భారీగా నిలిచిపోయింది.

Advertisement

Next Story