తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..

by Shyam |   ( Updated:2021-07-10 03:07:46.0  )
తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..
X

దిశ, వెబ్‌డెస్క్ : రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణం కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా.. ఇప్పటికే తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 2.1 కిమీ ఎత్తులో ఏర్పడి ఉండడంతో అల్పపీడనం మరింత బలపడింది. ఈ కారణంగా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. 11న ఏర్పడే అల్ప పీడనం కారణంగా పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, కొత్తగూడెం, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story