- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలిసారి హైదరాబాద్ మెట్రోలో ‘గుండె’ తరలింపు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రోలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరగని ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. గుండె మార్పిడి కోసం ఫస్ట్ టైమ్ ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి.. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు మెట్రోలో గుండెను తరలించారు. నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి గుండెను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఇదేక్రమంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు తరలించారు. డాక్టర్ గోకులే నేతృత్వంలో శస్త్ర చికిత్స జరగనుంది.
ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్‌కు గుండెను తరలించి.. అక్కడి నుంచి మెట్రోలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు నాన్ స్టాప్‌గా నడిపారు. దీనికి సంబంధించి ముందే సమాచారం అందడంతో మెట్రో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉన్నందున.. రోడ్డుమార్గంలో అంబులెన్స్‌లో గుండెను తరలిస్తే లేట్ అవుతుందని, మెట్రోలో గుండెను తరలించారు.