ఐరన్ లోపిస్తే మీ శరీరంలో జరిగేది ఇదే!

by Jakkula Samataha |
ఐరన్ లోపిస్తే మీ శరీరంలో జరిగేది ఇదే!
X

దిశ, ఫీచర్స్ : ఏ విషయంలోనైనా నెగ్లెట్ చేయవచ్చు కానీ ఆరోగ్యం విషయంలో అస్సలు నెగ్లెట్ చేయకూడదు అంటారు . మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సంపద ఉన్నట్లే అంటారు మన పెద్దలు. ఇక మన శరీరానికి లభించాల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ ఒకటి. శరీరానికి ఐరన్ చాలా అవసరం. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ కొంత మందిలో ఐరన్ సరిపడినంత ఉండదు. మరి ముఖ్యంగా గర్భిణీలు ఐరన్ సమస్యను అధికంగా ఎదుర్కొంటారు. అయితే మనం ఐరన్ లోపంతో బాధపడుతున్నాము అనే విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చునంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఐరన్ లోపంతో బాధపడే వ్యక్తులు బరువు తగ్గడమే కాకుండా చర్మం పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. అలాగే వారి కాళ్లు చేతులు చల్లబడటం జరుగుతూ ఉంటుంది.

2. కాసేపు నడిస్తే అలసిపోవడం, మాటి మాటికి తల తిరిగినట్లు, మైకంగా అనిపిస్తే వారిలో ఐరన్ లోపం ఉన్నట్లేనంట.

3. ఐరన్ లోపం ఉన్న వారిలో రోగనిరోధక శక్తి చాలా వరకు తక్కువగా ఉంటుందంట. చాలా బలహీనంగా కనిపిస్తారు.

4. శరీరంలో ఐరన్ లెవెల్స్ తగినంతగా లేకపోతే రక్తంలో ఆక్సిజన్-వాహక సామర్థ్యం తగ్గుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. శారీరక శ్రమ, బరువైన పనులు చేసే సమయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.

5. శరీరంలో ఐరన్ లెవెల్స్ తగినంతగా లేకపోతే ఏకాగ్రత లోపిస్తుంది. ఏ పని మీద దృష్టి సారించలేరు. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.

Advertisement

Next Story