గుండెపోటు వచ్చే ముందు మన శరీరంలో జరిగేది ఇదే!

by Jakkula Samataha |
గుండెపోటు వచ్చే ముందు మన శరీరంలో జరిగేది ఇదే!
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకు హార్ట్ ఎటాక్‌తో చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతుంది. రాత్రి వరకు మాట్లాడి.. పొద్దున లేచేసరికి శవమై ఉంటున్నారు. సరదాగా మాట్లాడుతూనే కుప్పకూలి పోతున్నారు. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేనప్పుడు గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది.అందువలన హెల్త్ విషయంలో చాలా కేర్ ఫుల్‌గా ఉండాలంట. గుండె పోటు సంకేతాలను ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి. అయితే గుండె పోటు వచ్చే ముందు మన శరీరంలో కనిపించే సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎడమ చేతి నొప్పి

2.విపరీతంగా చెమటలు పట్టడం

3.గుండె నుంచి వెన్నువైపుగా నొప్పి కదులుతున్నట్లు అనిపించడం

4.విపరీతమైన అలసట

5.కడుపులో గ్యాస్ పేరుకపోయినట్లు అనిపించడం

6.ఛాతిలో ఒత్తిడి

7. భుజాలు, మెడ భాగంలో నొప్పి

8.పొత్తి కడుపు ఉబ్బరం

9.శరీరం సహకరించకపోవడం

Advertisement

Next Story