- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ అలవాట్లు ఉన్నవారు జాగ్రత్త.. వీరికే క్యాన్సర్ రిస్క్ ఎక్కువంట!
దిశ, ఫీచర్స్ : మనం తీసుకునే ఆహారం, జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. రోజు రోజుకు క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కడుపులో కణాలు అసాధారణంగా పెరిగినప్పుడు, స్టమక్ క్యాన్సర్ వస్తుంది. అత్యంత ప్రమాదకరమైన దానిలో ఈ క్యాన్సర్ ఒకటి. కడుపులో క్యాన్సర్ ఉంటే ఆ వ్యక్తి చాలా బలహీనంగా ఉంటారు. కాగా, స్టమ్ క్యాన్సర్ ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
స్టమక్ క్యాన్సర్ లక్షణాలు :
బరువు తగ్గడం
పొత్తి కడుపు నొప్పి
వికారం, వాంతులు
ఆకలి లేకపోవడం
మల విసర్జనలో సమస్యలు
అయితే ఈ అలవాటు ఉన్నవారిలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటదంట, అందువలన క్యాన్సర్ బారిన పడకూడదంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలంట!
మద్యం సేవించడం, స్మోకింగ్ చేసే వారిలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుందంట.ఇది రోగ నిరోధక శక్తిని తగ్గించి, క్యాన్సర్ ముప్పును పెంచుతుంది అంటున్నారు వైద్యులు. అలాగే, అధిక ఒత్తిడి, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ అధికంగా తాగే వారిలో స్టమక్ క్యాన్స్ వచ్చే అవకాశం ఎక్కువ, అందుకే జంక్ ఫుడ్ అతిగా తినకూడదంట. ఇక కొంతమంది ఉప్పు అధికంగా తీసుకుంటారు. అయితే ఉప్పుతో క్యాన్సర్ ముప్పు అధికం అవుతుందంటున్నారు నిపుణులు.ఉప్పు అతిగా తీసుకుంటే.. పొట్టలోని పొర వాపు పెరుగుతుంది, దానితో కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంట.