ఫీవర్ వస్తే టక్కున పారాసెటమాల్ వేస్తున్నారా.. ఇది మీ లివర్‌కు ఎఫెక్టని తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-02-26 13:38:51.0  )
ఫీవర్ వస్తే టక్కున పారాసెటమాల్ వేస్తున్నారా.. ఇది మీ లివర్‌కు ఎఫెక్టని తెలుసా?
X

దిశ, ఫీచర్ : మనం అతిగా పనిచేసినప్పుడు మన శరీరం అలసిపోవడం అనేది చాలా కామన్. మన బాడీ అలసిపోయినప్పుడు నీరసంగా అనిపించడం, జ్వరం రావడం జరుగుతుంది. అయితే జ్వరం వస్తే ప్రతీ ఒక్కరూ షాప్‌కు వెళ్లడం పారాసెటమాల్ కొనుగోలు చేయడం వేసుకోవడం కామన్ అయిపోయింది.

కొద్దిపాటి జ్వరం వచ్చినా.. అతిగా జ్వరం వచ్చినా ఈ ట్యాబ్ లెట్ వేసుకోవడం మాములు. అంతే కాకుండా కొందరు కీళ్లనొప్పులు, తలనొప్పి, ఒళ్లు నొప్పులకు కూడా పారాసెటమాల్ ట్యాబ్‌లెట్‌నే వాడుతారు. అయితే దీనిపై ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మెడిసన్‌ను అతిగా వాడటం వలన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

తాజాగా ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనం, పారాసెటమాల్ భద్రత గురించి ఆందోళనలను లేవనెత్తింది. ఎలుకలపై ప్రయోగాలు చేసిన ఈ పరిశోధనలో పారాసెటమాల్‌ను అధికంగా ఉపయోగించడం లేదా మోతాదుకు మించి వాడటం వల్ల కాలేయం దెబ్బతింటుందని తేలినట్లు వారు తెలిపారు. పారాసెటమాల్ కాలేయంలోని కణాల మధ్య నిర్మాణాత్మక జంక్షన్ల కు అంతరాయం కలిగిస్తుందని అధ్యయనం సూచిస్తుంది. కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి లేని పెద్దలు ప్రతి 4-6 గంటలకు 650-1,000 mg, రోజుకు 3,000 mg మోతాదుకు మించి పారాసెటమాల్ వాడకూడదంట. ఒక వేళ 6,000 mg లేదా అంతకంటే ఎక్కువ మోతాదు వాడినట్లైతే అది తీవ్రమైన కాలేయ గాయం , కాలేయ వైఫల్యానికి కారణమవుతుందని వారు పేర్కొన్నారు. అందువలన పారాసెటమాల్ ట్యాబ్ లెట్ వేసుకునే ముందు కాస్త ఆలోచించాలంట. అతిగా ఎప్పుడూ ట్యాబ్‌లెట్ వేసుకోకూడదు నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story