సమ్మర్‌లో తాటి ముంజలు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయంటే?

by Hamsa |
సమ్మర్‌లో తాటి ముంజలు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయంటే?
X

దిశ, ఫీచర్స్: మార్చిలోనే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. భానుడి భగభగలు రోజు రోజుకు పెరిగిపోతూ ప్రజలు భయాందోళనకు గురి చేస్తున్నాయి కానీ తగ్గడం లేదు. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. దీంతో చాలా మంది అప్పుడే సమ్మర్ డైట్ స్టార్ట్ చేశారు. వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎండ ఉన్న సమయంలోనే ఎక్కువగా ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇంట్లో చల్లటి పానీయాలు తాగుతూ రెస్ట్ తీసుకుంటున్నారు.

ఇక చిన్న పిల్లలు, వృద్ధులైతే సాయంత్రం వేళలో తప్ప ఎక్కువగా బయట తిరగడం లేదు. ఉద్యోగాలు చేసేవారికి ఎంత ఎండలు ఉన్నప్పటికీ వెళ్లక తప్పడం లేదు. అయితే ఎండాకాలం మొత్తం శరీరాన్ని చలువ చేసే వాటిని మాత్రమే తింటుంటారు. వేసవిలో మామిడి కాయలు, పుచ్చకాయలు, తాటి ముంజలు, కొబ్బరి బొండాలు వంటివి అందుబాటులో ఉంటాయి. ఇందులో తాటి ముంజలు చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ఇవి కేవలం సమ్మర్‌లోనే దొరుకుతాయి కాబట్టి ఇవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ప్రకృతి నుంచి వస్తాయి కాబట్టి కల్లీ లేనివి, స్వచ్చమైనవిగా చెబుతుంటారు. తాటి ముంజలు మండుటెండల నుంచి మంచి ఉపశమనం కలిగించడంతో పాటుగా శరీరానికి పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

* తాటి ముంజల్లో విటమిన్స్ ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రోబో ప్లేవిస్, నియాసిస్, బీ కాంప్లెక్స్ వంటివి ఉండి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.

*అలాగే తాటి ముంజల్లో ఉండే నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. అంతేకాకుండా డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తాయి.

* ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటుగా గుండె ఆరోగ్యానికి సహాయపడుతాయి.

* తాటి ముంజలు ప్రతి రోజు తినడం వల్ల లివర్‌కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచిది వృద్ధి చెందుతుంది.

* తాటి ముంజలను తీసుకోవడం వల్ల గ్యాస్ ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

*ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను తాటీ ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే అధిక బరువును తగ్గించి నాజుకుగా ఉండేలా చేస్తాయి.

*ముంజల వల్ల ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. వాటిని గుజ్జుగా చేసి ముఖానికి రాసుకుంటే చెమటకాయలను తగ్గించడంతో పాటు చర్మాన్ని కాపాడుతాయి.

* 100 గ్రాముల మంజల్లో 43 క్యాలరీల వరకు ఉండి మలబద్దకాన్ని తరిమికొడతాయి.

* మొటిమలు ఎక్కువగా ఉండేవారు తాటి ముంజల్లో తెల్లని గుజ్జును ప్రతిరోజు ముఖానికి అప్లై చేసుకుంటే ఈ సమస్య తగ్గి మెరిసే అందం సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Next Story