ఆలుగడ్డలతో ఆరోగ్యానికి నష్టమా..? లాభమా..?

by S Gopi |
ఆలుగడ్డలతో ఆరోగ్యానికి నష్టమా..? లాభమా..?
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాదుంపల(ఆలుగడ్డలు) విషయంలో చాలామందికి ఓ డౌట్ ఉంటుంది. అవి తింటే నష్టమా.. లాభమా ? అనే డౌట్ ఉంటుంది. అయితే, బంగాళాదుంపల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 'చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవి చాలా మేలు చేస్తాయి. కళ్ల చుట్టూ ఉన్న వలయాలను బంగాళాదుంపలతో తొలగించుకోవొచ్చు. బలహీనంగా ఉన్నవారు, బరువు పెరగాలని కోరుకునేవారు బంగాళదుంపలు తినడం ఉత్తమం. చర్మంపై ముడతలు, అదేవిధంగా నల్లటి మచ్చలు కూడా ఇవి తొలగిస్తాయి. మలబద్ధక సమస్యలు, జీర్ణక్రియను సులభతరం చేయడానికి ఆలుగడ్డలు చాలా చక్కగా పని చేస్తాయి' అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed