వర్షాకాలంలో ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

by samatah |   ( Updated:2023-07-25 05:37:01.0  )
వర్షాకాలంలో ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం కాగానే చాలా మంది టీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కువ మంది ఉదయాన్నే అల్లంటీ తాగుతుంటారు. అయితే వర్షాకాలంలో అల్లం టీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

అల్లంలో ఉండే జింజెరాల్ వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వంటి అనారోగ్యాలను తొందరగా తగ్గిస్తుందంట. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి. ఇన్‌ఫెక్షన్లను రాకుండా కాపాడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయాన్నే అల్లం టీ తాగితే నీరసం,అలసట తగ్గటమే కాకుండా వికారం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు అన్ని తొలగిపోతాయి. అలాగే అల్లం టీ రక్తపోటును తగ్గిస్తుంది.

Advertisement

Next Story