- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. కిడ్నీలు డేంజర్ లో పడ్డట్టే..
దిశ, ఫీచర్స్ : మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు ఉన్న చిన్న చిన్న అలవాట్లు కిడ్నీలను ప్రమాదంలో నెట్టేస్తాయి. కిడ్నీలో స్టోన్స్ కావడం, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే మూత్రపిండాల ఆరోగ్యం కోసం కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. కిడ్నీకి హాని కలిగించే కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చంటున్నారు. మరి ఆ అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ సేపు కూర్చోవడం..
విరామం తీసుకోకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రెగ్యులర్ శారీరక శ్రమ రక్తపోటు, గ్లూకోజ్ జీవక్రియను సాధారణీకరించడంలో సహాయపడుతుంది. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఈ రెండు ముఖ్యపాత్ర పోషిస్తాయి. 8 గంటలకు పైగా కుర్చీ పై కూర్చొని పని చేస్తే, మధ్యలో విరామం తీసుకోవడం చాలా ముఖ్యం.
అధిక ఉప్పు వినియోగం..
మూత్రపిండాలకు సంబంధించిన చెడు అలవాట్లలో అధిక ఉప్పు వినియోగం కూడా ఒకటి. అధిక ఉప్పు వాడకం వలన రక్తపోటును పెంచుతుంది. దీంతో మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. అందుకే ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ పేషెంట్‌గా మారవచ్చు.
తక్కువ నీరు తాగాలి..
తగినంత నీరు తాగకపోవడం మూత్రపిండాలకు హానికరం అంటున్నారు నిపుణులు. నీటి కొరత మూత్రవిసర్జనలో సమస్యలను కలిగిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మిమ్మల్ని డీహైడ్రేట్ చేసే వస్తువులను తీసుకోవడం తగ్గించండి.
నిద్ర లేకపోవడం..
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర, విశ్రాంతి చాలా ముఖ్యం. మూత్రపిండాల పనితీరు నిద్ర - వేకప్ చక్రం ద్వారా నియంత్రిస్తారు. ఇది మూత్రపిండాలు రోజుకు 24 గంటలు పనిచేయడానికి సహాయపడుతుంది.
మూత్రాన్ని ఆపడం..
చాలా మంది వ్యక్తులు మూత్రాన్ని ఆపేస్తూ ఉంటారు. తరచుగా మూత్రాన్ని నిలిపివేస్తే మూత్రాశయంలో ఎక్కువసేపు మూత్రం ఉండి అది కిడ్నీ ఇన్ఫెక్షన్ దారి తీస్తుంది. అంతే కాదు కిడ్నీ ఫెయిల్ అయ్యే పరిస్థితి కూడా రావచ్చు.