- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోగి ఊపిరితిత్తుల్లో బొద్దింక.. షాక్ కు గురైన వైద్యులు..
దిశ, ఫీచర్స్ : శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గా ఉందంటూ ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని వైద్యుల బృందం పరీక్షించి షాక్‌కు గురయ్యారు. రోగి ఊపిరితిత్తుల నుంచి నాలుగు సెంటీమీటర్ల పొడవున్న బొద్దింకను వైద్యులు తొలగించారు. ఈ సంఘటన కేరళలోని కొచ్చిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం రోగి పూర్తిగా క్షేమంగా ఉన్నాడు. అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.
ఆసియానెట్ న్యూస్బుల్ ప్రకారం 55 ఏళ్ల రోగి తీవ్రమైన శ్వాస సమస్యలతో బాధపడుతూ కొచ్చిలోని ఓ ఆస్పత్రికి చేరుకున్నాడట. అతడి ఊపిరితిత్తులను పరిశీలించిన వైద్యులు ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారట. ఎందుకంటే, ఊపిరితిత్తుల్లో నాలుగు సెంటీమీటర్ల పొడవున్న బొద్దింక ఇరుక్కుపోయిందని తెలిపారు. దీంతో ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడని తెలిపారట. ఈ వైద్య ప్రక్రియ ఫిబ్రవరి 22న జరిగింది.
డాక్టర్ టింకు జోసెఫ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆపరేషన్ చేసి బొద్దింకను బయటకు తీశారు. బొద్దింక ఊపిరితిత్తుల లోపల కుళ్లిపోయింది. ఈ కారణంగా బహుశా రోగికి శ్వాస సమస్యలు పెరిగాయి. రోగి ఊపిరితిత్తుల నుంచి బొద్దింకను విజయవంతంగా తొలగించేందుకు వైద్యులకు ఎనిమిది గంటల సమయం పట్టింది. రోగికి అప్పటికే శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉన్నాయని, అందువల్ల శస్త్రచికిత్స చేయడం కాస్త కష్టంగా మారిందని వైద్యులు చెప్పారు.
ఇంత పెద్ద బొద్దింక రోగి ఊపిరితిత్తుల్లోకి ఎలా చేరిందో అనే ఆలోచన వస్తుంది కదా. అయితే రోగి ఒకరోజు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు వెళ్లినప్పుడు రోగికి ఓ ట్యూబ్ అమర్చారట. ఆ ట్యూబ్ లో ఉన్న బొద్దింక నేరుగా ఊపిరితిత్తులకు చేరుకుంది. ప్రస్తుతం రోగి పూర్తిగా క్షేమంగా ఉన్నాడని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల ఢిల్లీలోని వైద్యుల బృందం 26 ఏళ్ల యువకుడి పేగు నుండి 39 నాణేలు, 37 ఉంగరాలను తొలగించారు. పదేపదే వాంతులు, కడుపు నొప్పి రావడంతో ఆ యువకుడు ఆస్పత్రికి చేరుకున్నాడు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. బాడీ బిల్డింగ్ కోసం శరీరంలో జింక్ పెంచాలనే ఉద్దేశ్యంతో యువకుడు ఇలా చేసాడట.
గతేడాది తైవాన్ నుంచి కూడా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కిడ్నీ నుంచి 300కు పైగా రాళ్లను వైద్యులు తొలగించారు. ది ఇండిపెండెంట్ నివేదించిన ప్రకారం మహిళ తనను తాను హైడ్రేట్ గా ఉంచుకోవడానికి తీపి పానీయాలు మాత్రమే తాగిందట.