Water in copper bottle : రాగిపాత్రల్లోని నీరు ఎవరు తాగకూడదో తెలుసా?

by Jakkula Samataha |
Water in copper bottle : రాగిపాత్రల్లోని నీరు ఎవరు తాగకూడదో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : రాగి పాత్రలో నీరు తాగడం చాలా మంచిది అని నిపుణులు చెప్తుంటారు. ప్రతి రోజూ రాగి పాత్రలోని నీరు తాగడం వలన వాతం, పిత్తం, కఫం దోషాలు సమతుల్య ఏర్పడటమే కాకుండా రోగనిరోధక వ్యవస్థ కూడా బాగుంటుంది. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి. అయితే రాగి పాత్రలో నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదే అయినా కొంత మంది మాత్రం అస్సలే రాగి పాత్రలో నీరు తాగకూడదంట. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

  • అసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు అస్సలే రాగి పాత్రలోని నీరు తాగకూడదు. ఒక వేళ వీరు ప్రతి రోజూ రాగి పాత్రలోని నీరు తాగితే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  • కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ పేషెంట్స్ అస్సలే రాగి నీరు తాగకూడదంట.
  • థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కూడా రాగి పాత్రల్లోని నీరు అస్సలే తాగకూడదంట.
  • గుండె సమస్యలతో బాధపడుతున్న వారు, శ్యాస కోశ వ్యాధులు ఉన్న వారు రాగి నీళ్లకు చాలా దూరం ఉండాలంట.
  • విలన్స్ వ్యాధి గ్రస్తులు రాగికి చాలా దూరంగా ఉండాలి.

(నోట్ : పైవార్త నిపుణులు, ఇంటర్నెట్ సమాచారం మేరకు ఇవ్వబడినది. దిశ, దీనిని ధృవీకరించలేదు)

Advertisement

Next Story

Most Viewed